‘పాకిస్తాన్ ఆందోళన’కు కారణమైన ఇస్రో 100వ స్వదేశీ శాటిలైట్ విశేషాలు

  • 12 జనవరి 2018
ఇస్రో రాకెట్ Image copyright iSro

స్వదేశీ ఉపగ్రహాల ప్రయోగంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో సెంచరీ పూర్తిచేసింది. భారత దేశ ప్రజలకు కొత్త సంవత్సర కానుక అందించింది.

ఇస్రో సంధించిన పీఎస్‌ఎల్‌వీ సీ40 రాకెట్ శుక్రవారం ఉదయం 9.29 నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.

భారత్‌కు చెందిన మూడు ఉపగ్రహాలతో పాటు ఆరు దేశాలు అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఫిన్‌లాండ్, ఫ్రాన్స్, కొరియాలకు చెందిన 28 శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టింది.

ఉప గ్రహాలను రెండు వేర్వేరు కక్ష్యల్లో ప్రవేశపెట్టారు. భూమికి 359 కిలోమీటర్ల ఎగువన ఒకటి, 550 కిలోమీటర్ల ఎగువన ఉన్న మరో కక్ష్యల్లో వీటిని ప్రవేశపెట్టారు.

ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మొత్తం 2గంటల 21 నిమిషాల సమయం పట్టింది. ఇప్పటి వరకు ఇస్రో చేపట్టిన ప్రయోగాల్లో ఇదే సుదీర్ఘమైనది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionపీఎస్‌ఎల్‌వీ సీ-40 రాకెట్‌ - ISRO వీడియో

ఒక్క ప్రయోగం.. 31 ఉపగ్రహాలు!

పీఎస్‌ఎల్‌వీ సీ-40 రాకెట్‌ ద్వారా స్వదేశీ ఉపగ్రహం కార్టోశాట్‌-2తో పాటు మరో 30 ఉపగ్రహాలను ఒకేసారి రోదసిలోకి పంపించారు.

గతంలో ప్రయోగించిన 6 కార్టోశాట్ ఉపగ్రహాల మాదిరిగానే కార్టోశాట్‌-2 కూడా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్.

భూమికి 505 కిలోమీటర్ల ఎత్తులో భూకేంద్ర కక్ష్యలో ఈ శాటిలైట్‌ను ప్రవేశపెట్టారు. వెంటనే ఇది తన పని ప్రారంభించింది.

ఏదైనా ఇట్టే ఫొటోలు తీయోచ్చు!

కార్టోశాట్‌ భూమికి 505 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. కానీ భూమిపై దేనినైనా అత్యంత స్పష్టంగా, నాణ్యమైన ఫొటోలు తీస్తుంది.

ఇంకా చెప్పాలంటే సుమారు అర మీటర్‌ విస్తీర్ణంలో ఉన్న వస్తువులను కూడా ఇది క్లియర్‌గా ఫోటోలు తీస్తుంది.

అంతేకాదు, ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో అవసరమైన టార్గెట్‌ను మాత్రమే ఫొటోలు తీసే సదుపాయం కూడా ఇందులో ఉంది.

Image copyright SSTL

మరింత పక్కాగా భూముల లెక్క!

కార్టోశాట్‌-2 పంపించే ఫొటోల ఆధారంగా గ్రామీణ, పట్టణ ప్రాంత భూముల లెక్కలను పక్కాగా గుర్తించొచ్చు.

తీరప్రాంత భూములను గుర్తించడంతో పాటు వాటి వినియోగాన్ని లెక్క కట్టొచ్చు.

నీటి పంపిణీ వ్యవస్థ, రోడ్‌ నెట్‌వర్క్ పరిశీలన, నావిగేషన్ అప్లికేషన్లకు కూడా కార్టోశాట్ పంపించే ఫొటోలు ఎంతో ఉపయోగపడతాయి.

భూ వాతావరణంలో మార్పులను గుర్తించడానికి ఇది సహాయం చేస్తుంది.

కార్టోశాట్‌-2ఈఆర్‌ బరువు 710 కేజీలు. దీని కాలపరిమితి ఐదేళ్లు.

మైక్రోశాట్‌, నానో శాట్ 1సీ విశేషాలు

కార్టోశాట్‌తో పాటు భారత్‌కు చెందిన మైక్రోశాట్‌, నానోశాట్1సీ కూడా పీఎస్‌ఎల్‌వీ సీ-40 ద్వారా ప్రయోగించారు.

నానో శాటిలైట్ సిరీస్‌-ఐఎన్‌ఎస్‌లో ఇది మూడోది.

11కిలోల బరువు ఉంటుంది. దీని కాల పరిమితి ఆరు నెలలు.

మినియేచర్ మల్టీ స్పెక్ట్రల్‌ టెక్నాలజీ డెమానుట్రేషన్-ఎంఎంఎక్స్‌-టీడీ సాంకేతికతను ఉపయోగిస్తుంది.

ఐఎన్‌ఎస్‌-1సీ తీసిన ఫొటోల ఆధారంగా స్థలాకృతికి సంబంధించిన మ్యాప్‌లు తయారు చేస్తారు.

Image copyright AFP

మిగతా 28 ఉపగ్రహాలలో అమెరికా, బ్రిటన్‌, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా, ఫ్రాన్స్‌, ఫిన్‌లాండ్‌, కెనడా దేశాలకు చెందిన 3 మైక్రో, 25 నానో శాటిలైట్లు ఉన్నాయి.

కార్టోశాట్‌-2 బరువు 710 కేజీలు కాగా విదేశాలకు చెందిన 28 శాటిలైట్ల మొత్తం బరువు 470 కేజీలు.

భారత రాష్ట్రపతి కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.పీఎస్‌ఎల్‌వీ సీ40 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు.

ఇది భారత దేశానికి ఇస్రో ఇచ్చి కొత్త సంవత్సర కానుక అని అభివర్ణించారు.

పాకిస్తాన్ ఆందోళన

కాగా, ఇస్రో ఉపగ్రహ ప్రయోగం నేపథ్యంలో పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేసింది.

ఉపగ్రహాలను సైనిక అవసరాలకు ఉపయోగించుకుని దక్షిణాసియాలో ‘అధికార అస్థిరత’కు పాల్పడే అవకాశం ఉందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మొహమ్మద్ ఫైజల్ హెచ్చరించారని ఇండియా టుడే సహా పలు వార్తా సంస్థలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

గుజరాత్ 2002 అల్లర్ల ముఖ చిత్రాలైన వీళ్లను గుర్తుపట్టారా.. వీళ్లు ఇప్పుడేం చేస్తున్నారు

ఏరియా 51: అమెరికాలో రెండు పట్టణాలను గడగడలాడిస్తున్న 'ఏలియన్స్ జోక్'.. మానవ విపత్తులా మారిన ఈవెంట్

ధోనీని మళ్లీ ఆడతాడా... భారత క్రికెట్‌కు అతడి అవసరం ఇంకా ఉందా?

హైదరాబాద్ ఖజానా నుంచి పాకిస్తాన్‌కు చేరిన 3.5 కోట్ల పౌండ్ల సొమ్ము దక్కేది ఎవరికి

గోదావరి బోటు ప్రమాదం: 20కి చేరిన మృతులు.. మరో 27 మంది ఆచూకీ గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు

కశ్మీరీలను ఆగ్రా జైలులో పెట్టిన ప్రభుత్వం.. తమవారిని కలుసుకునేందుకు ఇబ్బందులు పడుతున్న బంధువులు

పెరియార్ : దక్షిణాది రాష్ట్రాలు భారతదేశంలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు

సెప్టెంబర్ 17: విలీనమా.. విమోచనా... 1948లో జరిగిన హైదరాబాద్ విలీనాన్ని ఎలా చూడాలి