లండన్‌లో మోదీ వ్యతిరేక ప్రదర్శనలకు కారణం ఏమిటి?

  • 21 జనవరి 2018
లండన్‌లో మోదీ వ్యతిరేక ప్రదర్శనలు

లండన్‌లోని పార్లమెంట్‌ స్క్వేర్‌ వద్ద వందలాది మంది దక్షిణాసియా ప్రజలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

లండన్ సహా బర్మింగ్‌హామ్, ఓల్వర్‌హాంప్టన్‌ నగరాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు వచ్చారు.

పార్లమెంట్‌ స్క్వేర్‌ నుంచి భారత హైకమిషనర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.

భారతదేశంలో దళితులపై దాడులు జరుగుతున్నాయని, దాడుల నియంత్రణలో ప్రభుత్వం విఫలం అవుతోందని నిరసనకారులు ఆరోపించారు.

'మోదీ ప్రభుత్వం డౌన్ డౌన్', 'ఆర్ఎస్‌ఎస్ డౌన్‌డౌన్‌' అంటూ నినాదాలు చేశారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionభారత్‌లో దళితులపై దాడులకు వ్యతిరేకంగా లండన్‌లో జరిగిన ఒక ప్రదర్శన

బ్రిటన్‌లో ఉన్న కుల సంఘాలతో పాటు దక్షిణాసియాలోని కొన్ని సంస్థలు ఈ నిరసనలో పాల్గొన్నాయి.

భారత్‌లో ఏం జరుగుతోందో ప్రపంచమంతా చూస్తోందని, ఆ విషయాన్ని మోదీ సర్కార్‌కు తెలియచేసేందుకే ఈ ప్రదర్శన చేపట్టామని కల్పనా విల్సన్ చెప్పారు.

భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ఆమె అన్నారు.

భారత హైకమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు లండన్ వచ్చామని, ఆయన ఈ విషయాన్ని భారత ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారని వందన సంజయ్ అనే మరో నిరసనకారుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

భీమా-కోరేగాంలో పరిణామాలు ఈ ఆందోళన చేపట్టేలా తమను ప్రోత్సహించాయని సందీప్ టెల్మోర్‌ అన్నారు.

భారత దేశంలో ఇప్పటికీ కుల వివక్ష కొనసాగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆందోళనకారులకు దళిత నేత, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ మద్దతు తెలిపారు.

గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన మేవానీకి మద్దతిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ స్థానంలో తమ అభ్యర్థిని నిలబెట్టలేదు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.