జెరూసలేం యాత్రకు ఆర్థికసాయం పెంచిన ఏపీ ప్రభుత్వం - ప్రెస్ రివ్యూ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హజ్, జెరూసలేం యాత్రలకు ఆర్థికసాయం పెంచుతూ మంగళవారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేసిందని 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.
''వార్షిక ఆదాయం రూ.3 లక్షల కంటే తక్కువగా ఉన్న యాత్రికులకు రూ.60 వేలు, రూ.3 లక్షలు పైబడి ఉన్నవారికి రూ.30 వేలు ఇవ్వనున్నట్టు పేర్కొంది. జెరూసలేంతో పాటు బైబిల్లో ఉన్న ఇతర క్రైస్తవ పవిత్ర ప్రదేశాల యాత్రకు కూడా ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని ఆ జీవోలో పేర్కొన్నారు. ఆర్థిక సాయం పొందాలనుకునే హజ్ యాత్రికులు ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించడంతో పాటు యాత్రకు అవసరమయ్యే డ బ్బు మొత్తం ముందుగానే చెల్లించాలని, సర్టిఫికెట్లను పరిశీలించి అర్హులైనవారికి ఆర్టీజీఎస్ ద్వారా ఆర్థిక సాయం అందజేస్తారని జీవోలో పేర్కొన్నార''ని వివరించారు.
- అమరావతి ప్రాజెక్టు నుంచి తప్పుకున్న సింగపూర్ కన్సార్షియం
- అమరావతి నుంచి రాజధాని మారుస్తున్నారా? అక్కడేం జరుగుతోంది?
'ప్రఖ్యాత సంస్థలన్నీ తెలంగాణ క్యూ'
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానంతో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అనేక సంస్థలు పెట్టుబడులతో తెలంగాణకు తరలివచ్చాయని మంత్రి కేటీఆర్ చెప్పారంటూ 'సాక్షి' పత్రిక కథనం ప్రచురించింది.
''తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఐదేళ్లలో పారిశ్రామిక, ఐటీ రంగాల్లో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించిందని కేటీఆర్ చెప్పారు.
సింగపూర్ కాన్సుల్ జనరల్ పొంగ్ కాక్‌టియన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం కేటీఆర్‌తో భేటీ అయింది. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని కేటీఆర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, సింగపూర్ నడుమ మరింత బలమైన వ్యాపార, వాణిజ్య సంబంధాలు నెలకొల్పేందుకు అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు.
హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అనేక విదేశీ కంపెనీలు ముందుకొస్తున్నాయని సింగపూర్ కాన్సుల్ జనరల్ పొంగ్ కాక్‌టియన్‌కు కేటీఆర్ వివరించారు. పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చే సంస్థలకు పూర్తి సహకారం అందిస్తామని, స్థానికంగా ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించేం దుకు సింగపూర్ కంపెనీలతో సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి కోరారు. ఐటీ, పరిశ్రమల మంత్రితో జరిగిన భేటీ ద్వారా తెలంగాణలో పెట్టుబడులకున్న అవకాశాలపై మరింత స్పష్టత వచ్చిందని సింగపూర్ కాన్సుల్ జనరల్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో పెట్టుబడులకు అనువైన వాతావరణంపై తమ దేశంలోని పారిశ్రామికవర్గాల్లో విస్తృత ప్రచారం కల్పిస్తామని హామీనిచ్చార''ని ఆ కథనంలో తెలిపారు.
- 17 ఏళ్లుగా దొరకని నేరస్తుడిని డ్రోన్ల సాయంతో పట్టుకున్న పోలీసులు
- సౌదీ అరేబియా చమురు కేంద్రాలపై డ్రోన్ దాడులు.. భారీగా ఎగసిపడుతున్న మంటలు
కవ్వాల్ అడవుల్లో డ్రోన్‌తో నిఘా
కవ్వాల్ అడవుల్లో సంచరించే స్మగ్లర్లను, వేటగాళ్లను నిరోధించేందుకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని 'నమస్తే తెలంగాణ' కథనం తెలిపింది.
''అధికారులు మంచిర్యాల జిల్లా ఇందన్పల్లి రేంజ్లో ఇవాళ డ్రోన్ కెమెరాలతో ప్రయోగాత్మకంగా పర్యవేక్షించారు. వన్యప్రాణులు, అడవులను సంరక్షించేందుకు నిరంతరం పర్యవేక్షణ కోసం ఈ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని ఎఫ్‌డీవో మాధవరావు తెలిపారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ అడవుల్లో ఎక్కడ ఏం జరుగుతుందనే విషయాన్ని ముందు గుర్తించి, చర్యలు తీసుకోవచ్చన్నార''ని తెలిపారు.

హైదరాబాద్‌లో ఎక్కడి మెట్రోలక్కడే.. విద్యుత్ నిలిచిపోవడమే కారణం
హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీ-నాగోల్ కారిడార్‌లో మెట్రో రైళ్లు మంగళవారం దాదాపు గంటపాటు ఎక్కడివక్కడ నిలిచిపోయాయని 'ఈనాడు' కథనం తెలిపింది.
''విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మంగళవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో అమీర్‌పేట నుంచి బేగంపేట వైపు వెళ్తున్న రైలు అమీర్‌పేట స్టేషన్ దాటగానే కనకదుర్గ ఆలయం సమీపంలో పెద్ద శబ్దంతో నిలిచిపోయింది. బోగీల్లో చీకట్లు అలముకున్నాయి. ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఒక ప్రయాణికుడు తమకు ఫోన్ చేశారని సనత్ నగర్ అగ్నిమాపక కేంద్రం అధికారి ప్రదీప్ తెలిపారు.
రైలు ముందు ఉన్న అత్యవసర ద్వారం నుంచి దిగి ప్రయాణికులు అమీర్‌పేట స్టేషన్‌కు వెళ్లారు. అమీర్ పేట, హైటెక్ సిటీ మార్గంలోనూ మెట్రో రైళ్లు ఆగిపోయాయి. సుమారు గంట తరువాత విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు.
మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందిస్తూ ఎలక్ట్రికల్ లైన్ నుంచి విద్యుత్ తీసుకునే పరికరం మెట్రో రైలుకు పైన ఉండే తీగల్లో ఇరుక్కుపోవడం వల్ల రైలు నిలిచిపోయిందన్నార''ని ఆ కథనంలో వివరించారు.
ఇవి కూడా చదవండి.
- జెరూసలెంలో భారత సంతతి సంగతేంటి?
- జెరూసలెం: మూడు మతాలకు పవిత్ర క్షేత్రంగా ఎలా మారింది?
- జెరూసలెం.. ఎందుకంత పవిత్రం? ఎందుకంత వివాదాస్పదం?
- ప్రపంచంలోనే కష్టమైన ప్రయాణం!
- ఫీజుల పెంపుపై జేఎన్‌యూ విద్యార్థుల ఆందోళనల్లో న్యాయం ఉందా?
- ఈ దేశంలో ఒక్క ఏడాదిలో 30 వేల హత్యలు... ఈ బీభత్సానికి కారణం ఎవరు?
- మీకు కొన్ని కూరగాయలు, ఆకు కూరలు అంటే అయిష్టమా? దానికి కారణమేంటో తెలుసా...
- భారత్‌లో మొబైల్ డేటా రేట్లు ఏ స్థాయిలో పెరిగే అవకాశాలున్నాయి...
- బ్యాంకులు మహిళలకు తక్కువ, మగవారికైతే ఎక్కువ రుణాలు ఇస్తున్నాయా...
- హాంకాంగ్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఆకలి, చలి... బయటకొస్తే జైలు
- ‘తెలంగాణలో అమిత్ షా, కేసీఆర్‌ల రాజ్యం నడుస్తోంది’ - వీక్షణం ఎడిటర్ ఎన్ వేణుగోపాల్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)