ఈ వారం మీరు ఎన్ని సిగరెట్లు తాగారో తెలుసా?

దిల్లీలో ఊపిరి పీల్చడం అంటే.. రోజుకు దాదాపు 25 సిగరెట్లు కాల్చడంతో సమానం. మీరు నివసిస్తున్న నగరంపై క్లిక్ చేసి, రోజుకు మీరు ఎన్ని సిగరెట్లు కాలుస్తున్నారో తెలుసుకోండి.

నవంబర్ 7న దిల్లీని పొగమంచు కప్పేసింది. విషపూరితమైన ఈ పొగమంచు ప్రభావంతో స్కూళ్లను కూడా మూసేశారు. అమెరికా-దిల్లీ మధ్య నడిచే యునైటెడ్ ఎమిరేట్స్ సర్వీసులన్నింటినీ ఆపేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే 30 రెట్లు అధికంగా కాలుష్యం నమోదైంది.

ఎయిర్ క్వాలిటి వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ వెబ్‌సైట్ ప్రకారం నవంబర్ 6న దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఊపిరితిత్తుల్లోకి నేరుగా చేరే ‘పర్టిక్యులేట్ మేటర్’ (పి.ఎమ్. 2.5) స్థాయి 700 మైక్రోగ్రామ్స్/క్యూబిక్ మీటర్‌గా నమోదైంది. ఈ స్థాయి15 µg/m3గా ఉంటే సాధారణం. ఈ విలువ 81 µg/m3 కన్నా ఎక్కువగా నమోదైతే కాలుష్యం ఎక్కువని అర్థం.

కొన్ని నివేదికలు.. దిల్లీ కాలుష్యం రోజుకు 45 సిగరెట్లు కాల్చడంతో సమానం అని చెబుతున్నాయి.

మీరు ఎన్ని సిగరెట్లు తాగారో తెలుసుకోవాలని ఉందా? అంటే... మీ నగర కాలుష్యం ఏమేరకు ఉందో తెలుసుకోవాలి. అందుకు మీరుండే నగరంపైన ఓసారి క్లిక్ చేయండి.

బెర్క్‌లీ ఎర్త్ నివేదిక ప్రకారం చైనాలో వాయు కాలుష్యంతో ఏటా 16 లక్షల మంది చనిపోతున్నారు. వీరు పీల్చే గాలిలో కాలుష్య స్థాయి దాదాపు 52 μg/m3. 16 లక్షల మంది చావాలంటే.. ఉదాహరణకు 1.36x9-6 చావులు / ఒక సిగరెట్, అనుకుంటే లక్ష సిగరెట్లు కావాలి. చైనా జనాభా 135 కోట్లు. ఒక మనిషి సంవత్సరానికి 764 సిగరెట్లు తాగినట్టు లెక్క. అంటే రోజుకు 2.4 సిగరెట్లు కాల్చడంతో సమానం.

మరో విధంగా చెప్పాలంటే ‘రోజుకు ఒక సిగరెట్’ కాల్చడం.. 22 μg/m3 (ఖచ్చితమైన విలువ: 21.6 μg/m3) తో సమానం.

బీజింగ్ నగరంలో పి.ఎమ్.2.5 స్థాయి సంత్సరానికి 85 μg/m3. అంటే రోజుకు 4 సిగరెట్లు కాల్చడంతో సమానం. దిల్లీలో ఇదే సంవత్సరానికి పి.ఎమ్.స్థాయి 547 μg/m3 గా నమోదైంది. అంటే ఈ కాలుష్యం రోజుకు 25 సిగరెట్లు కాల్చడంతో సమానం.

మేము దేశంలోని 33 నగరాల్లో నమోదైన ‘పి.ఎమ్.2.5’ స్థాయిలను ఒక వారం పాటు వరుసగా సేకరించాం. ఈ గణాంకాల ఆధారంగా ప్రతి నగరంలోని 6 రోజుల పి.ఎమ్.2.5 స్థాయిలను సరాసరి లెక్కించాం. ఈ కాలుష్యాన్ని సిగరెట్ల రూపంలో తేవడానికి ఒక్కో నగరం సరాసరి విలువను 21.6 μg/m3 తో భాగించాం. మీరు చూడబోయే లెక్కలు కేవలం ఉదాహరణ మాత్రమే.