నితీశ్ కుమార్

 1. బిహార్: రాష్ట్రంలో ప్రతి రోజూ 12 వేలకు పైగా కొత్త కేసుల నమోదు

  నీరజ్ సహాయ్, పాట్నా నుంచి

  బిహార్‌లో కరోనా పరిస్థితి

  బిహార్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా పరిస్థితిని సమీక్షించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మంగళవారం రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు.

  బిహార్‌లో రోజురోజుకూ కరోనా సోకుతున్న వారి సంఖ్య పెరుగుతోందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

  మంగళవారం రాష్ట్రంలో 12,604 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

  సోమవారం నమోదైన పాజిటివ్ కేసుల కన్నా మంగళవారం 801 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.

  దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 94,275కు చేరింది.

  అధికారిక గణాంకాల ప్రకారం, మంగళవారం 85 మంది చనిపోయారు.

  అయితే, కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య 3,31 418 కాగా రికవరీ రేటు 77.43 శాతం ఉంది.

  గత 24 గంటల్లో బిహార్‌లో 1,00,328 టెస్టులు చేశారు. కరోనా సంక్రమణ రేటు 14 శాతానికి పెరిగినట్లు గురించారు.

  సోమవారం సంక్రమణ రేటు 12.68 శాతంగా నమోదైంది.

  ప్రస్తుతం బిహార్ రాజధాని పాట్నాలో అత్యధికంగా 17 వేలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి.

  ఏడువేల యాక్టివ్ కేసులతో మరొక జిల్లా రెండో స్థానంలో ఉండగా ఔరంగాబాద్, బేగూసరాయ్‌లలో నాలుగు వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

 2. నీరజ్ ప్రియదర్శి

  పట్నా నుంచి, బీబీసీ కోసం

  పట్నా రహదారి

  ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేక సాయుధ పోలీస్ అధికారి ఏ వారంట్ లేకుండానే తనిఖీలు చేయవచ్చని, అరెస్ట్ కూడా చేయవచ్చని కొత్త బిల్లులో స్పష్టంగా ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బిల్లును ఆమోదించిన రోజును బ్లాక్ డేగా వర్ణిస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 3. నితిశ్ కుమార్

  "నేను ముఖ్యమంత్రి కావాలని కోరుకోలేదు. బీజేపీ నాయకుల అభ్యర్థన మేరకు మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించడానికి అంగీకరించాను'' అని నితిశ్ వ్యాఖ్యానించారు.

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: నితీశ్‌కుమార్‌కు ఇవి చివరి ఎన్నికలా? ఆయన ప్రస్థానం ఎలా సాగింది?
 5. రజనీష్ కుమార్

  బీబీసీ ప్రతినిధి

  తేజస్వి యాదవ్

  2020లో తేజస్వి యాదవ్ రాజకీయాలను, తన ప్రచారం, ప్రసంగించే శైలిని పూర్తిగా మార్చుకున్నారు. ఈసారి ఆయన ఏకంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని భావించినా.. ఫలితాల్లో పెద్ద పార్టీ హోదాతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

  మరింత చదవండి
  next
 6. నితీశ్ కుమార్

  మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు 122 సీట్లు అవసరం కాగా బీజేపీ మిత్ర పక్షాలకు 125 సీట్లు వచ్చాయి. కూటమిలో బీజేపీకి 74 సీట్లు రాగా.. ఇప్పటివరకూ ఎన్‌డీఏలో ‘పెద్దన్న’గా ఉన్న జేడీయూ బలం 43 సీట్లకు పడిపోయింది.

  మరింత చదవండి
  next
 7. నీతీశ్ కుమార్

  ఒకప్పుడు... మట్టిలోనైనా కలుస్తాను గానీ బీజేపీతో కలవను అని నితీశ్‌ అన్నారు. అయితే రాజకీయాల్లో ఇవన్నీ మామూలేనని విశ్లేషకులు చెబుతుంటారు.

  మరింత చదవండి
  next
 8. దిల్ నవాజ్ పాషా

  బీబీసీ ప్రతినిధి

  అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం, ముస్లింలు, ఓటర్లు, బిహార్ ఎన్నికలు

  ఎంఐఎం కన్నా లౌకికవాద నినాదంతో ముందుకు వచ్చిన ఆర్‌జేడీ మహాకూటమి వైపు ముస్లిం ఓటర్లు మొగ్గు చూపుతారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ, ఫలితాలు ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉన్నట్లు సూచిస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 9. ఎన్‌డీఏకు సంపూర్ణ ఆధిక్యం

  బిహార్‌ ఎన్నికల్లో ఎన్‌డీఏకు సంపూర్ణ ఆధిక్యం లభించింది. బీజేపీ మిత్ర పక్షాలకు 125 సీట్లు వచ్చాయి. ప్రభుత్వం ఏర్పాటుకు 122/243 సీట్లు సరిపోతాయి. అయితే, అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ అవతరించింది. ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయంటే...

  ఆర్జేడీ - 75

  బీజేపీ - 74

  జేడీయూ - 43

  కాంగ్రెస్ - 19

  సీపీఐ(ఎంఎల్) - 12

  హెచ్‌ఏఎం - 4

  ఎంఐఎం - 5

  సీపీఎం - 2

  సీపీఐ - 2

  బిహార్ ఎన్నికలు
 10. ముందంజలో ఎవరున్నారు...

  ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం బిహార్ ఎన్నికల్లో వినిధ పార్టీల ఆధిక్యాలు ఈ విధంగా ఉన్నాయి...

  బిహార్ ఎన్నికలు