శరణార్థులు

 1. Video content

  Video caption: చైనా జైలు నుంచి తప్పించుకున్న ఉత్తర కొరియా దొంగ

  జు జియాన్‌జియాన్ అనే ఉత్తర కొరియా దేశస్తుడు చైనాలోని ఒక జైలు నుంచి ఎంతో ధైర్యం చేసి తప్పించుకున్నాడు.

 2. Video content

  Video caption: సముద్రంలో మునిగిపోతున్న నౌక.. 300 మంది ఇలా ప్రాణాలు కాపాడుకున్నారు

  లంపెడూసా దీవి వద్ద ఒక నౌక సముద్రంలో మునిగిపోతోంది. ఆ నౌకలో ప్రయాణిస్తున్న 300 మంది ప్రాణాలను ఇటలీ కోస్ట్ గార్డులు ఇలా కాపాడారు.

 3. Video content

  Video caption: అఫ్గానిస్తాన్- తజికిస్తాన్ సరిహద్దుల్లో రష్యా సైన్యం.. ఎందుకు వచ్చిందంటే..

  తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకోవడం, పరిపాలన ప్రారంభించడంతో ఎంతో మంది ప్రజలు అఫ్గానిస్తాన్‌ను వీడే ప్రయత్నం చేస్తున్నారు.

 4. Video content

  Video caption: కఠిన పర్వతాలు ఎక్కి, వారాల తరబడి నడుస్తూ సరిహద్దులు దాటేస్తున్నారు ఇలా..

  అఫ్గానిస్తాన్‌లో నెలకొన్న మానవీయ సంక్షోభం పట్ల పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో టర్కీ అధికారులు సరిహద్దుల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

 5. Video content

  Video caption: ఈత రాదు కానీ ఇంగ్లిష్ చానల్ దాటేందుకు సాహసం
 6. రజిని వైద్యనాథన్

  బీబీసీ దక్షిణాసియా ప్రతినిధి

  గ్రామీణ ప్రాంత అఫ్గాన్లు

  కొన్ని రోజులుగా ఎవరైనా ఇంటి తలుపు కొడితే చాలు నా గుండె కొట్టుకోవడం ఆగిపోతోంది. వచ్చింది తాలిబాన్లేనా? నేను, నా కుటుంబం ఇక్కడ ఉన్నట్లు వారికి తెలిసిపోయిందా? అని నా మెదడులో రకరకాల ప్రశ్నలతో చిత్రవధ అనుభవిస్తున్నా.

  మరింత చదవండి
  next
 7. జో బైడెన్

  "మేము క్షమించం. మర్చిపోం. మేం వారిని వదిలిపెట్టం. వెంటాడి వేటాడుతాం. దానికి వారు మూల్యం చెల్లించుకునేలా చేస్తాం"

  మరింత చదవండి
  next
 8. నేహా శర్మ

  బీబీసీ ప్రతినిధి

  ప్రతీకాత్మక చిత్రం

  లతీఫా ఒక భారతీయ మహిళ. ఆమెకు ఒక అఫ్గానీతో పెళ్లయ్యింది. తాలిబాన్లు కాబుల్‌ను చేజిక్కించుకున్నప్పుడు అక్కడి నుంచి భారత్ రావాలని ఆమె అనుకున్నారు. కానీ, ఈ ప్రయాణం అంత సులభంగా జరగలేదు.

  మరింత చదవండి
  next
 9. విమానంలో శరణార్థులు

  ఈ విమానాలను పెద్ద పెద్ద యుద్ధ ట్యాంకులను, ట్రక్కులను మోసుకెళ్లడానికి కూడా ఉపయోగిస్తుంటారు.

  మరింత చదవండి
  next
 10. అఫ్గాన్ నుంచి ఏ ఏ దేశాలు ఎంత మందిని తరలించాయి?

  అఫ్గాన్ శరణార్థులు

  తాలిబాన్లు ఆదివారం కాబుల్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నప్పటి నుంచి అనేక దేశాలు తమ పౌరులను, బలహీనమైన అఫ్గాన్‌లను దేశం నుండి తరలించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి.

  ఇప్పటివరకు, పారిపోయిన అఫ్గాన్లలో ఎక్కువ మంది అమెరికాకు వెళ్లారు.

  దేశాల వారీగా తరలింపు సంఖ్యలు:

  • అమెరికా : గత 24 గంటల్లో 2,000 మందితో సహా ఇప్పటి వరకు మొత్తంగా 5,200 మందిని తరలించారు. 22వేల మంది బలహీనమైన అఫ్గాన్లను, దేశంలో ఉన్న 15వేల మంది అమెరికన్లను తరలిస్తామని అమెరికా ప్రతిజ్ఞ చేసింది. ఆగష్టు 31ని తరలింపు గడువుగా పెట్టుకున్నప్పటికీ, ఆ తర్వాత కూడా దీనిని కొనసాగిస్తామని అధ్యక్షులు జో బైడెన్ చెప్పారు.
  • బ్రిటన్ : ఆదివారం నుంచి అఫ్గాన్లతో సహా దాదాపు 1,200 మందిని తరలించింది. రోజుకు 1,000 మందిని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
  • జర్మనీ : 100 మంది అఫ్గాన్లతో సహా ఆదివారం నుంచి మొత్తంగా 500 మందిని తరలించింది.
  • ఫ్రాన్స్: 184 మంది అఫ్గాన్లతో సహా ఆదివారం నుంచి మొత్తంగా 204 మందిని తరలించింది.
  • స్పెయిన్: 500 మందిని తరలించింది.
  • నెదర్లాండ్స్: 35 మంది తమ జాతీయులను తరలించింది. 1,000 మంది అఫ్గాన్ కార్మికులను, వారి కుటుంబాలను తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
  • డెన్మార్క్: 84 మందిని తరలించింది.
  • హంగేరి: 26 మంది తమ దేశస్థులను తరలించింది.
  • పోలాండ్: 50 మందిని తరలించింది.
  • చెక్ రిపబ్లిక్: అఫ్గాన్ కార్మికులతో సహా 46 మందిని తరలించింది.
  • జపాన్: 12 మంది రాయబార కార్యాలయ సిబ్బందిని తరలించింది.
  • ఆస్ట్రేలియా: అఫ్గాన్లతో సహా 26 మందిని తరలించింది. తమతో పని చేస్తున్న అఫ్గాన్ కార్మికులందరికీ సహాయం చేసే అవకాశం లేదని చెప్పింది.
  • భారతదేశం: 170 మందిని తరలించింది.
  • టర్కీ: 552 మంది తమ దేశస్థులను తరలించింది.
  • స్విట్జర్లాండ్: 230 మంది అఫ్గాన్ కార్మికులను తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

  (సోర్స్ : రాయిటర్స్)