ఎన్నికల కమిషన్

 1. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం

  చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ ఎంపీపీ అభ్యర్థి అశ్విని హాసిని విజయం సాధించారు

  రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ హవా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లో సగానికి పైగా ఆపార్టీ గెలుచుకుంది.

  మరింత చదవండి
  next
 2. ఎన్నికలు

  పరిషత్‌ ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టు సింగిల్ బెంచ్‌ ఇచ్చిన స్టేను డివిజన్ బెంచ్ కొట్టివేసింది.

  మరింత చదవండి
  next
 3. కరోనావైరస్

  ఏవై.12 రకం తొలి కేసు ఉత్తరాఖండ్‌లో ఆగస్టు 30న వెలుగు చూసింది. వారం రోజుల్లోపే తెలుగు రాష్ట్రాలకూ ఇది వ్యాపించింది.

  మరింత చదవండి
  next
 4. అబ్బూరి సురేఖ

  బీబీసీ ప్రతినిధి

  కేసీఆర్

  తెలంగాణా దళిత బంధు పథకం కోసం ప్రత్యేక డెబిట్ కార్డు తయారు చేశారు. దానిపై పథకం పేరు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో ఉన్నాయి. పథకం ప్రారంభంలో భాగంగా 'దళితబంధు' చెక్కులు, ప్రత్యేక డెబిట్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు.

  మరింత చదవండి
  next
 5. రాఘవేంద్ర రావ్

  బీబీసీ ప్రతినిధి

  getty images

  ఏడీఆర్ వివరాల ప్రకారం, 2017-18, 2019-20 ఆర్థిక సంవత్సరాల మధ్య రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.6200 కోట్ల కంటే ఎక్కువ మొత్తాన్ని అందుకున్నాయి. అందులో సుమారు 68 శాతం అంటే రూ.4.5 వేల కోట్ల రూపాయలకు పైగా మొత్తం బీజేపీకి దక్కింది.

  మరింత చదవండి
  next
 6. బ్రెజిల్ పోలీసులు

  రియో డి జనీరలో అత్యధిక ప్రాంతం నేరగాళ్ల అధీనంలోనే ఉంటుంది. ఆ నేరగాళ్లకు మాదక ద్రవ్యాల ముఠాలతో సంబంధాలుంటాయి.

  మరింత చదవండి
  next
 7. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  నాగార్జున సాగర్ ఉపఎన్నిక

  2014 నుంచి తండ్రి నోముల నర్సింహయ్యకు రాజకీయాల్లో సహకరిస్తూ వచ్చిన భగత్ కుమార్ ఇవాళ తండ్రి స్థానంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

  మరింత చదవండి
  next
 8. కేరళలో చరిత్రాత్మక విజయం దిశగా ఎల్‌డీఎఫ్

  కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) పార్టీ చరిత్రాత్మక విజయం దిశగా పయనిస్తోంది. మొత్తం 140 స్థానాల్లో ప్రస్తుతం ఎల్‌డీఎఫ్ 85 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష యూడీఎఫ్ కూటమి 44 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది.

  ఈ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ పూర్తి విజయం సాధిస్తే, కేరళలో గత నాలుగు దశాబ్దాలుగా ప్రతీ ఎన్నికలకు అధికారం పార్టీలు మారే సంప్రదాయానికి తెర పడినట్లే.

  కేరళలో ఒకసారి వామపక్షాలు గెలిస్తే, మరొకసారి కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణం గెలుస్తూ ఉంటుంది. కానీ, ఈ ఎన్నికల్లో మలయాళీలు లెఫ్ట్ పార్టీకి రెండోసారి కూడా పట్టం కడుతున్నారు. బీజేపీ ప్రస్తుతం నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

  కణ్ణూర్ జిల్లాలోని ధర్మాదం అసెంబ్లీ స్థానంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన సమీప ప్రత్యర్థిపై 13 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

  పినరాయి విజయన్
 9. విజయోత్సవాలపై మరోసారి హెచ్చరికలు జారీ చేసిన ఈసీ

  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎక్కువ స్థానాల్లో ఫలితాల సరళి వెల్లడైంది.

  దీంతో విజయానికి చేరువవుతున్న పార్టీల మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు.

  చాలా ప్రాంతాల్లో జనం భారీగా గుమిగూడి డాన్సులు చేస్తూ, పాటలు పాడుతున్నారు.

  ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ స్వీట్లు తినిపించుకుంటున్నారు.

  ఇలాంటి విజయోత్సవాలను నిషేధించినట్లు ఎన్నికల సంఘం ఇంతకు ముందే ప్రకటించింది.

  కానీ విజయోత్సాహంలో ఉన్న కార్యకర్తలు ఈ మార్గదర్శకాలను పాటిస్తున్నట్లు కనిపించడం లేదు.

  దీంతో ఎన్నికల సంఘం మరోసారి దీనిపై హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి వేడుకలు వెంటనే నిలిపివేయాలని, ఇది ఈసీ మార్గదర్శకాలు ఉల్లంఘించినట్లే అవుతుందని చెప్పింది.

  దీనిపై ఒక ప్రకటన జారీ చేసిన ఎన్నికల సంఘం, దీనిని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పింది.

  మళ్లీ ఆదేశాలు జారీ చేస్తున్నామని, పార్టీల కార్యకర్తలు, అందరూ తమ ఆదేశాలు పాటించేలా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

  విజయోత్సవాలు జరుగుతున్న ప్రాంతాల్లో, బాధ్యులైన ఎస్‌హెచ్ఓ, మిగతా అధికారులు వెంటనే సస్పెండ్ చేయాలని, వారిపై క్రిమినల్/క్రమశిక్షణా చర్యలు ప్రారంభించాలని ఆదేశించింది.

  ఎన్నికల సంఘం ఆదేశాలు
 10. రాఘవేంద్ర రావు

  బీబీసీ ప్రతినిధి

  కరోనా వైరస్

  ''ఇది పెద్ద సమస్య కాదు. మహమ్మారి ఉన్న సమయంలో ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ఎన్నికలు జరిగాయి. దీని కారణంగా వైరస్ ఉద్ధృతి పెరిగినట్లు ఎక్కడా గుర్తించ లేదు.

  మరింత చదవండి
  next