క్యూబా

 1. హవానాలోని అమెరికా దౌత్య కార్యాలయం

  క్యూబాలో దాడుల వల్ల దౌత్య ఉద్యోగులకు వినిపించకపోవడం, వికారం, ఇతర సమస్యలు తలెత్తాయి.

  మరింత చదవండి
  next
 2. చే గువేరా

  జూన్ 14, 1928.. చే గువేరా పుట్టిన రోజు. ఆయన్ను అక్టోబర్ 9, 1967న హత్య చేశారు. అప్పటికి ఆయన వయస్సు 39 ఏళ్ళు.

  మరింత చదవండి
  next
 3. క్యూబాలో నిరసనలు

  క్యూబా ఆర్థిక వ్యవస్థ పతనంతో పాటు, పౌర స్వేచ్ఛపై ఆంక్షలు, కరోనా మహమ్మారి నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం పట్ల ఆగ్రహావేశాలతో ఉన్న ప్రజలు వీధుల్లోకొచ్చారు.

  మరింత చదవండి
  next
 4. విల్ గ్రాంట్

  క్యూబా ప్రతినిధి, బీబీసీ న్యూస్

  హెక్టార్, క్రిస్టియన్

  తన కొడుకుని నిరంతరం జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ ఉండకపోతే.. అతడు తనని తానే తినేయవచ్చునని.. అలా చనిపోయే ప్రమాదం ఉందని హెక్టార్ చెప్తున్నారు.

  మరింత చదవండి
  next
 5. క్యూబా సాయం తీసుకోవడంపై దక్షిణాఫ్రికాను తప్పుపట్టిన అమెరికా

  క్యూబా

  కరోనావైరస్ సంక్షోభం విషయంలో క్యూబా సాయం తీసుకుంటున్నందుకు దక్షిణాఫ్రికాను అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తప్పుపట్టారు.

  క్యూబా నుంచి దాదాపు 200 మంది నిపుణులతో కూడిన బృందం ఇటీవల దక్షిణాఫ్రికాకు వచ్చింది. ఆ బృందంలో అంటువ్యాధుల నిపుణులు, ఫిజీషియన్లు, బయో టెక్నాలజీ నిపుణులు, వైద్యానికి సంబంధించి ఇతర నిపుణులు ఉన్నారు.

  అయితే, క్యూబా ఈ మహమ్మారి నుంచి ప్రయోజనం పొందాలనుకుంటోందని పాంపియో ఆరోపించినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది.

  ‘‘క్యూబా కపటాన్ని తెలుసుకుని, వారి మద్దతును నిరాకరించిన బ్రెజిల్, బొలీవియా లాంటి దేశాలను అభినందిస్తున్నాం. అన్ని దేశాలూ ఇలాగే వ్యవహరించాలని మేం కోరుతున్నాం. దక్షిణాఫ్రికా, కతార్‌లను కూడా ఇదే కోరుతున్నాం’’ అని పాంపియో అన్నారు.

  ఈ వ్యాఖ్యలపై క్యూబా అధ్యక్షుడు మిగుల్ దియాజ్ కానెల్ ట్విటర్‌లో స్పందించారు. క్యూబా అంతర్జాతీయంగా ఎప్పుడు వైద్య సహకారం అందించినా.. అమెరికా అబద్ధాలు, అసత్య ఆరోపణలతో దాడి చేస్తూనే ఉంటుందని వ్యాఖ్యానించారు.

 6. కరోనా మహమ్మారిపై పోరాటంలో క్యూబాకు ప్రశంసలు

  క్యూబా కరోనా

  క్యూబా శనివారం దక్షిణాఫ్రికాలో 216 వైద్య సిబ్బందిని పంపించింది. కరోనావైరస్ మహమ్మారితో పోరాటంలో సాయం చేయడానికి క్యూబా ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా 20 వైద్య బృందాలను పంపించింది. కొంతమంది దీనిని సోషలిస్టు యూనిటీగా చెబుతుంటే, మరికొందరు దీనిని మెడికల్ డిప్లొమసీ పేరు ఇస్తున్నారు.

  లెఫ్ట్ పాలన ఉన్న క్యూబాలో ఇటీవల ఆఫ్రికా, కరిబియన్ దేశాలకు సుమారు 1200 మంది వైద్య సిబ్బందిని పంపించింది. క్యూబా యూరప్ సంపన్న దేశాలకు కూడా తమ వైద్య సిబ్బందిని పంపించింది. అమెరికా డోనల్డ్ ట్రంప్ ప్రభుత్వం క్యూబా వైద్య సిబ్బంది సాయం తీసుకోవద్దని ప్రపంచ దేశాలను కోరింది.

  అయితే క్యూబా తమ వైద్య సిబ్బందిని పంపిన దేశాల్లో వారికి స్వాగతం లభిస్తోంది. క్యూబాలో మొత్తం 1337 కరోనా కేసులు బయటపడ్డాయి. ఇప్పటివరకూ 51 మంది చనిపోయారు. క్యూబాలో తలసరి డాక్టర్ల లభ్యత ఎక్కువగా ఉంటుంది. మహమ్మారిని ఎదుర్కోవడంలో క్యూబాలో హెల్త్ కేర్ సిస్టమ్‌‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి.

  దక్షిణాఫ్రికా ఆరోగ్య మంత్రి జ్వెలీ మఖీజ్ “క్యూబాలో మంచి విషయం ఏంటంటే ఇక్కడ సామాజిక ఆరోగ్య సేవలు ఉన్నాయి. మేం ఈ మోడల్‌ను ఇష్టపడతాం. దక్షిణాఫ్రికాలోకరోనా వైరస్ వ్యాపించి 4361 కేసులు వచ్చాయి. 86 మంది చనిపోయారు. దక్షిణాఫ్రికాకు క్యూబాతో ప్రత్యేక బంధం ఉంది. క్యూబా సైనికులు దక్షిణ అంగోలా యుద్ధంలో పోరాడారు. నెల్సన్ మండేలా జైలు నుంచి విడుదల కావడానికి సాయం చేశారు. నెల్సన్ మండేలా విడుదలైన తర్వాత ఫిదెల్ కాస్ట్రోకు ధన్యవాదాలు కూడా చెప్పారు” అన్నారు.