ఆమ్నెస్టీ

 1. జోయెల్ గంటర్

  బీబీసీ న్యూస్

  చైనా తీరుపై నిరసనలు

  దారుణంగా కొట్టడం, విద్యుత్ షాక్ ఇవ్వడం, స్ట్రెస్ పొజిషన్స్(గోడకుర్చీలు, మెడలో బరువులు కట్టడం వంటి శిక్షలు) వంటివే కాకుండా టైగర్ చైర్‌లో రోజుల తరబడి బంధించడం(శరీరంలో ఏ భాగం కదపడానికి వీల్లేకుండా కుర్చీలో కట్టేయడం) వంటి దారుణ హింసకు గురిచేస్తున్నారని ఆమ్నెస్టీ తన నివేదికలో వెల్లడించింది.

  మరింత చదవండి
  next
 2. పీయూష్ గోయల్

  వ్యవసాయ చట్టాలపై రైతులకు ఏమైనా సందేహాలుంటే.. వారికి భారత ప్రభుత్వం తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని.. ప్రతి అంశాన్నీ, ప్రతి నిబంధననూ చర్చించవచ్చునని గోయల్ చెప్పారు.

  మరింత చదవండి
  next
 3. ఆమ్నెస్టీ ఇండియా

  ''మానవతా దృక్ఫథంతో చేసిన పనులపై గొప్పలు చెప్పుకోవడం, అధికారంలో ఉన్నవారిపై విమర్శలు చేయడం ద్వారా.. చట్టాల ఉల్లంఘనల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలని ప్రయత్నిస్తున్నారు. భిన్న దర్యాప్తు సంస్థలు చేపడుతున్న విచారణలనూ ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తున్నారు''

  మరింత చదవండి
  next
 4. సౌదీ అరేబియా

  2019లో రికార్డు స్థాయిలో 189 మందికి సౌదీ అరేబియా మరణ శిక్షలు అమలు చేసిందని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అంటోంది. మైనర్‌గా ఉండగా చేసిన నేరానికి మరణ శిక్ష పడ్డ కేసు వీటిలో కనీసం ఒక్కటైనా ఉందని తెలిపింది.

  మరింత చదవండి
  next
 5. పేదల ఇబ్బందులను ఇంకా పెంచొద్దు: భారత ప్రభుత్వానికి ఆమ్నెస్టీ సంస్థ విజ్ఞప్తి

  ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్

  భారత్‌లో కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో లక్షల సంఖ్యలో వలస కార్మికులు, పేదలు కనీస అవసరాలకు నోచుకోకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది.

  ప్రభుత్వ విధానాలు, చర్యలు పేదలు, నిస్సహాయుల ఇబ్బందులను తగ్గించేలా ఉండాలని, వాటిని మరింత తీవ్రం చేసేలా ఉండకూడదని విమర్శించింది.

  కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలన్నీ ప్రభుత్వం తీసుకోవడం ముఖ్యమేనని, కానీ ఈ ప్రక్రియలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యే వర్గాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవడం కూడా అంతే అవసరమని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవినాశ్ కుమార్ అన్నారు.

  ‘‘దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా ఆహారం, మంచినీరు లాంటి కనీస అవసరాలకు దూరంగా లక్షల మంది పేదలు చిక్కుకుపోయారు. దురదృష్టవశాత్తు ప్రభుత్వం యంత్రాంగం వారికి కరోనావైరస్ కన్నా పెద్ద ముప్పుగా పరిణమించింది. ప్రభుత్వం అణిచివేత ధోరణితో కాకుండా స్నేహపూర్వకంగా వ్యవహరించాలి. ఆరోగ్యపరమైన సంక్షోభ పరిస్థితులున్నా సరే, హింస ఎంత మాత్రమూ సరికాదు’’ అని అవినాశ్ అన్నారు.

  లాక్‌డౌన్ వల్ల ఉపాధి కోల్పోయినవారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. క్వారంటీన్‌లో ఉన్నవారి హక్కులను కూడా పరిరక్షించాలని, వారి కనీస అవసరాలను ప్రభుత్వం తీర్చాలని విజ్ఞప్తి చేశారు.

 6. ఫరూక్ అబ్దుల్లా

  ఫారూక్ అబ్దుల్లాను కోర్టులో హాజరుపరచాలని ఎండీఎంకే నేత వైగో వేసిన పిటిషన్ విచారణకు కొన్ని గంటల ముందు అబ్దుల్లాను జమ్మూకశ్మీర్ పీఎస్ఏ కింద నిర్బంధించినట్లు వార్తలు వచ్చాయి.

  మరింత చదవండి
  next