యూరోజోన్

 1. సర్క్యులర్ రంపం

  2019లో చేయి తెగ్గొట్టుకోవడానికి ముందు ఆమె ఏకంగా 5 బీమా పాలసీలు తీసుకున్నారని కోర్టు గుర్తించింది.

  మరింత చదవండి
  next
 2. ప్రపంచ దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది?

  కరోనావైరస్

  అమెరికా: గత 24 గంటల్లో 3 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. మొత్తం మృతుల సంఖ్య 51 వేలు దాటింది. ఈ దేశంలో 8.9 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడిన వారి సంఖ్యతో పోల్చితే మరణాల శాతం తక్కువే ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

  చైనా:కరోనావైరస్ పుట్టుకపై స్వతంత్ర అంతర్జాతీయ దర్యాప్తు జరిపించాలనే డిమాండ్‌ను చైనా తిరస్కరించింది. యూకేలో చైనా దౌత్యవేత్త ఒకరు బీబీసీతో మాట్లాడుతూ, ఇలాంటి డిమాండ్లు రాజకీయ దురుద్దేశాలతో కూడుకున్నవని, మహమ్మారి మీద చైనా చేస్తున్న పోరాటంపై నుంచి దృష్టి మళ్లించేలా చేస్తాయని అన్నారు.

  బెల్జియం: లాక్‌డౌన్ క్రమక్రమంగా తొలగించేందుకు దేశ ప్రధాని సోఫీ విల్మెస్ పూర్తి స్థాయి ప్రణాళికను ప్రకటించారు. కొత్త నిబంధనల ప్రకారం మే 11 నుంచి షాపులు తెరుచుకుంటాయి. ఆ తరువాత వారంలో పాఠశాలలు ప్రారంభమవుతాయి. అయితే, తరగతి గదిలో విద్యార్థులు పరిమిత సంఖ్యలో ఉండాలనే నియమం విధించారు. ఈ దేశంలో 44 వేలకు పైగా ప్రజలు కరోనావైరస్ బారిన పడ్డారు. 6,700 మంది చనిపోయారు.

  ఆస్ట్రేలియా - న్యూజీలాండ్: ఏప్రిల్ 25న ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ దేశాల్లో 'అంజాక్ డే' జరుపుకుంటారు. ఈ జాతీయ దినోత్సవాన్ని ప్రజలు సాధారణంగా ఎంతో గొప్పగా జరుపుకుంటారు. కానీ, కరోనావైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ జాతీయ దినోత్సవాన అమర వీరులకు ప్రజలు తమ ఇంటి వద్దే నిల్చుని క్యాండిల్ వెలిగించి నీరాజనాలు పలకాలని ప్రభుత్వం సూచించింది. దేశ చరిత్రలో ఇలా తొలిసారి జాతీయ వేడుకల్ని రద్దు చేయాల్సి రావడం విచారకరమని న్యజీలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్డెర్న్ అన్నారు.

 3. బీబీసీ తెలుగు కరోనావైరస్ LIVE అప్‌డేట్స్ పేజీకి తిరిగి స్వాగతం

  ఇప్పటివరకూ ఉన్న ముఖ్యాంశాలు

  • ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ కరోనావైరస్ బారినపడ్డవారి సంఖ్య 25 లక్షలు దాటింది.

  • అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండేందుకు అనుమతించే గ్రీన్ కార్డుల జారీని 60 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు. కొన్ని మినహాయింపులు ఉంటాయని చెప్పారు. కానీ, అవేంటన్నదానిపై స్పష్టత లేదు.

  • ఇటలీలో వరుసగా రెండో రోజూ కరోనావైరస్ కొత్త కేసులు తగ్గాయి. ఆ దేశంలో ఇప్పటివరకూ మొత్తం 1.07 లక్షలకుపైగా మంది కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మే 4 నుంచి లాక్‌డౌన్‌లో కొన్ని మినహాయింపులు ఇస్తామని, త్వరలోనే వాటిని ప్రకటిస్తామని ఆ దేశ ప్రధాని చెప్పారు.

  • బ్రిటన్‌లో కరోనావైరస్ కారణంగా ఇప్పటివరకూ 823 మంది చనిపోయారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు గురువారం మనుషులపై కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు ప్రారంభించబోతున్నారు.

  ఏప్రిల్ 21 వరకు కరోనా LIVE అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  కరోనావైరస్
 4. బోరీ జాన్సన్

  ఓటింగ్‌ను బహిష్కరించే లేబర్ పార్టీ ఎంపీలు, టోరీ బ్రెక్సైటర్స్ బృందంతో సహా పార్టీ నుంచి తాను బహిష్కరించిన తిరుగుబాటుదారులపై ప్రధానమంత్రి దృష్టి పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.

  మరింత చదవండి
  next