సమాజ్ వాదీ పార్టీ

 1. తాలిబాన్లను భారత స్వాతంత్ర్య ఉద్యమకారులతో పోల్చిన యూపీ ఎంపీ.. దేశ ద్రోహం కేసు నమోదు

  షఫీకుర్ రెహ్మన్

  ఉత్తర్ ప్రదేశ్‌లో సంభల్ నియోజకవర్గ ఎంపీ, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు షఫీకుర్ రెహ్మన్ బుర్క్‌పై దేశ ద్రోహం కేసు నమోదైంది.

  ఓ బీజేపీ కార్యకర్త ఫిర్యాదుపై పోలీసులు చర్యలు తీసుకున్నారు.

  అఫ్గాన్‌లో అధికారాన్ని కైవసం చేస్తున్న తాలిబాన్లను భారత స్వాతంత్ర్య ఉద్యమకారులతో రెహ్మాన్ పోల్చారు.

  ఈ విషయంపై సంభల్ ఎస్పీ చక్రేశ్ మిశ్రా మీడియాతో మాట్లాడారు. ‘‘కోత్వాలిలో ఎంపీ రెహ్మాన్‌పై ఫిర్యాదు నమోదైంది. ఆయన తాలిబాన్లను.. భారత స్వాతంత్ర్య ఉద్యమకారులతో పోల్చారు. ఇలాంటి వ్యాఖ్యలు దేశ ద్రోహం కిందకు వస్తాయి. అందుకే ఐపీసీలోని సెక్షన్ 124-ఏ, 153-ఏ, 295ల కింద ఆయనపై కేసు నమోదు చేశాం. మరోవైపు సోషల్ మీడియలో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మరో ఇద్దరి వీడియోలు కూడా కనిపిస్తున్నాయి. వాటిపై కూడా కేసు నమోదుచేశాం’’అని మిశ్రా వివరించారు.

  రెహ్మాన్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

  ‘‘భారత్‌ను బ్రిటిష్ వారు ఆక్రమించినప్పుడు మనం స్వాతంత్ర్యం కోసం పోరాడాం. అలానే ఇప్పుడు తాలిబాన్లు కూడా తమ స్వాతంత్ర్యం కోసం పోరాడారు. మొదట రష్యాపై, నేడు అమెరికాపై వారు పోరాటం చేశారు. ఇది వారి స్వాతంత్ర్య ఉద్యమం. దీనిలో ఎవరూ జోక్యం చేసుకోకూడదు’’అని రెహ్మాన్ వ్యాఖ్యానించారు.

  రెహ్మాన్ వ్యాఖ్యలను బీజేపీ నాయకులు ఖండించారు. ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పాలని ఉత్తర్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యతోపాటు మరికొందరు బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. రెహ్మాన్‌ను రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా విమర్శించారు.

  కేసు నమోదైన అనంతరం స్పందన కోరేందుకు రెహ్మాన్‌ను బీబీసీ సంప్రదించింది. అయితే, ఆయన స్పందించలేదు.

  రెండేళ్లక్రితం వందేమాతరంపై కూడా ఆయన ఇలానే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో ఉర్దూలో ఆయన ప్రమాణం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వందేమాతరం ఇస్లాంకు వ్యతిరేకమైనది. మేం దాన్ని పాడలేం’’అని అన్నారు.

 2. సరోజ్ సింగ్

  బీబీసీ కరస్పాండెంట్

  ఉత్తర్ ప్రదేశ్‌లో కొత్త జనాభా పాలసీ త్వరలో యోగీ ప్రభుత్వం ముందుకు రాబోతోంది.

  జనాభా విధానం ప్రధాన ఉద్దేశం రాష్ట్ర జనాభాను స్థిరీకరించడం, సంతానోత్పత్తి రేటును తగ్గించడమేనని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అంటున్నారు. అందుకోసం, ఇద్దరు పిల్లలు మాత్రమే కనాలన్న నియమం అవసరం లేదంటున్నారు జనాభా నిపుణుడు అలోక్ బాజ్‌పేయి.

  మరింత చదవండి
  next
 3. అమర్ సింగ్

  చాలాకాలంగా అనారోగ్యంతో ఉన్న రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ సింగపూర్‌లో చనిపోయారు. 2013లో ఆయన కిడ్నీ విఫలమై అనారోగ్యం పాలయ్యారు. ఆ తరువాత మూత్రపిండాల మార్పిడి చేయించుకున్నారు.

  మరింత చదవండి
  next
 4. దివ్య ఆర్య

  బీబీసీ ప్రతినిధి

  రమాదేవి

  పార్లమెంటులో ఎంపీ రమాదేవిపై తాను చేసిన అశ్లీల వ్యాఖ్యలకు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ క్షమాపణలు చెప్పారు.

  మరింత చదవండి
  next