ప్రపంచ బ్యాంకు

 1. ఏంజెలికా కాసస్, బోర్ డెంగ్

  బీబీసీ న్యూస్

  హిల్డా రోబెల్స్

  ''ఇలాంటి సంఘాల వల్ల ప్రజలు తమ అవసరాలను తీర్చుకోవడం చూస్తుంటే చాలా సరదాగా అనిపిస్తుంటుంది. వీటి వల్ల వడ్డీలకు అప్పులు తెచ్చుకోవడం తగ్గుతుంది. ముఖ్యంగా లాటిన్ అమెరికన్లకు ఇలాంటి సంఘాలతో చాలా లబ్ధి చేకూరుతోంది.''

  మరింత చదవండి
  next
 2. ఆర్థిక సంక్షోభం

  ''కరోనావైరస్‌కు చైనానే కారణమని అమెరికా నిందించే బదులు.. ఒక పరిష్కారం కనుగొనేందుకు రెండు దేశాలు కలిసి పనిచేయాలి''

  మరింత చదవండి
  next
 3. బ్రెజిల్‌లో తల్లీకొడుకులు

  లాక్ డౌన్ దెబ్బకు చాలా మంది అల్పాదాయ వర్గాల ప్రజల జీవితాల్లో కల్లోలం చెలరేగింది. అదే సమయంలో ఇంట్లో ఉంటూ ఏసీ గదుల్లో వర్క్ ఫ్రమ్ హోం పేరిటన పని చేస్తున్న వారు మాత్రం వారికి తెలీకుండానే బాగా వెనకేస్తున్నారు.

  మరింత చదవండి
  next
 4. దక్షిణాసియాలో ఆర్థిక మాంద్యం రావచ్చు

  ప్రపంచ బ్యాంక్ అంచనా

  కరోనావైరస్

  కరోనావైరస్ సంక్షోభం కారణంగా భారత్ సహా దక్షిణాసియా దేశాలు... ఆర్థిక ప్రగతి విషయంలో 40 ఏళ్లలోనే ఎన్నడూ లేనంత దారుణ స్థితికి చేరుకునే దశలో ఉన్నాయని ప్రపంచ బ్యాంక్ అంటోంది.

  దక్షిణాసియా ఆర్థిక వృద్ధి రేటు ఈ ఏడాది 1.8 శాతం నుంచి 2.8 శాతం మధ్య ఉండొచ్చని అంచనా వేసింది. ఆరు నెలల క్రితం ఇదే ప్రపంచ బ్యాంక్ దక్షిణాసియా వృద్ధి రేటు 6.3 శాతం ఉండొచ్చని లెక్కగట్టింది.

  భారత్‌తోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, నేపాల్, శ్రీలంక, భూటాన్, మాల్దీవులు దక్షిణాసియాలో ఉన్నాయి. ప్రపంచ జనాభాలో దాదాపు పావు వంతు ఇక్కడే నివసిస్తున్నారు.

  ఏప్రిల్‌తో మొదలైన ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 1.5 శాతం నుంచి 2.8 శాతం మధ్య ఉండొచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ వృద్ధి రేటు కూడా చాలా క్షీణిస్తుందని పేర్కొంది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, మాల్దీవులు ఆర్థిక మాంద్యంలో కూరుకుపోవచ్చని ప్రపంచ బ్యాంక్ అంటోంది.

  పేదరిక నిర్మూలన విషయంలో ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా సాధించిన ప్రగతి తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఏర్పడిందని వ్యాఖ్యానించింది.

 5. భారతదేశానికి 100 కోట్ల డాలర్ల అత్యవసర నిధులు: ప్రపంచ బ్యాంకు ఆమోదం

  కరోనావైరస్ విజృంభణను ఎదుర్కోవటం కోసం భారతదేశానికి 100 కోట్ల డాలర్లు (సుమారు 7,613 కోట్ల రూపాయలు) అత్యవసర నిధుల ప్యాకేజీ అందించటానికి ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలిపింది.

  వైరస్ మహమ్మారి వ్యాప్తిని నివారించటానికి ప్రపంచ బ్యాంకు మొత్తం 25 దేశాలకు దాదాపు 200 కోట్ల డాలర్ల నిధులు అందించనుంది.

  ఈ అత్యవసర ఆర్థిక సాయంలో అత్యధిక భాగం భారతదేశానికి ఇస్తోంది. ‘‘వైరస్ స్క్రీనింగ్‌ను మెరుగుపరచటం, కాంటాక్ట్‌ల ఆచూకీ తెలుసుకోవటం, లేబొరేటరీ డయాగ్నోస్టిక్స్, వ్యక్తిగత రక్షణ పరికరాల కొనుగోళ్లు, కొత్త ఐసొలేషన్ వార్డుల ఏర్పాటుకు తోడ్పడటం కోసం’’ ఈ ప్యాకేజీ అందిస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు చెప్పింది.

  దక్షిణాసియాలో.. పాకిస్తాన్‌కు 20 కోట్ల డాలర్లు, అఫ్ఘానిస్తాన్‌కు 10 కోట్ల డాలర్లు, శ్రీలంకకు 12.86 కోట్ల డాలర్లు, మాల్దీవులకు 73 లక్షల డాలర్లు అందించటానికి వరల్డ్ బ్యాంక్ ఆమోదం తెలిపింది.

 6. చైనాను హెచ్చరించిన వరల్డ్ బ్యాంక్

  చైనా అధ్యక్షుడు

  కరోనావైరస్ మహమ్మారి వల్ల ఆసియాలో పేదరికం పరిధి పెరగవచ్చని ప్రపంచ బ్యాంక్ తన రిపోర్టులో ఆందోళన వ్యక్తం చేసింది.

  ఈ రిపోర్టులో కరోనావైరస్ వల్ల పర్యాటకం, వాణిజ్యం, వస్తువుల క్రయవిక్రయాల ఆధారిత ఆర్థికవ్యవస్థ ప్రమాదంలో పడిందని చెప్పింది.

  దీనివల్ల ఆసియాలో చాలామంది జీవనోపాధిపై ప్రభావం పడుతుందని తెలిపింది.కరోనా వల్ల చైనా ఆర్థికవ్యవస్థ స్తంభిస్తుందని, దాని వృద్ధి రేటు 6.1 నుంచి 2.3 శాతానికి పడిపోవచ్చని చెప్పింది.

  ఈ మహమ్మారి మరింత దారుణంగా మారితే చైనా ఆర్థిక వృద్ధి 0.1 శాతానికి కూడా చేరుకోవచ్చని, దాని చుట్టుపక్కల దేశాల ఆర్థిక పరిస్థితి కూడా దారుణంగా ఉంటుందని పేర్కొంది.

 7. ఆలోక్ ప్రకాశ్ పుతుల్

  బీబీసీ కోసం

  మహిళ

  'ఐదేళ్ల గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సగటు వినియోగం పెరగడం పోయి, మరింత పతనమవుతోంది. నిరుద్యోగ రేటు 45ఏళ్లలో ఇప్పుడే అత్యధికంగా ఉంది'

  మరింత చదవండి
  next
 8. రాజేశ్ పెదగాడి

  బీబీసీ ప్రతినిధి

  చంద్రబాబు నాయుడు, అబ్దుల్ కలామ్

  ''పెద్దయ్యాక నీకు ఏం కావాలని ఉంది?'' ఇది చిన్నారులకు అబ్దుల్ కలాం ఎప్పుడూ సంధించే ప్రశ్న. అయితే ఓ పదేళ్ల బాలిక ఇచ్చిన సమాధానం కలాంను ఆలోచనల్లో మునిగేలా చేసింది.

  మరింత చదవండి
  next
 9. సురంజన్ తివారీ

  బీబీసీ ప్రతినిధి

  ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్

  'సులభతర వ్యాపార సూచి-2020'లో భారత్ ఏకంగా 14 స్థానాలు ఎగబాకి 63వ స్థానంలో ఉంది. దీనికి కారణాలు ఏమిటి? ప్రపంచ బ్యాంకు నివేదిక ఏం చెబుతోంది?

  మరింత చదవండి
  next
 10. ఐఎంఎఫ్

  అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) తీసుకునే అన్ని రకాల నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రజల మీద ప్రభావం చూపుతాయి. అసలు ఈ ఐఎంఎఫ్ ఏమిటి? ఇది ఎందుకు ముఖ్యమైనది? దీని మీద విమర్శలు ఏమిటి?

  మరింత చదవండి
  next