మధ్యప్రదేశ్

 1. నితిన్ శ్రీవాస్తవ

  బీబీసీ ప్రతినిధి

  బక్స్‌వాహ అడవి

  బక్స్‌వాహా అటవీ ప్రాంతంలో వజ్రాల కోసం భూమిని తవ్వేందుకు ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన ఎస్సెల్ మైనింగ్ సంస్థకు లైసెన్స్ దక్కింది. అడవినిని నరికేస్తే జీవనోపాధి కోల్పోతామని అక్కడి ప్రజలు, తీవ్ర పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని యాక్టివిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  మరింత చదవండి
  next
 2. షురేహ్ నియాజీ

  బీబీసీ కోసం, సాగర్ నుంచి

  ప్రహ్లాద్ సింగ్ రాజ్‌పుత్

  ఆ సమయంలో అక్కడ మంచి రోడ్లుగానీ, మెరుగైన రవాణా సౌకర్యాలు గానీ లేవు. అయినా ప్రహ్లాద్ సరిహద్దు దాటి పాకిస్తాన్ చేరుకున్నారు. ఆయన ఎలా అక్కడకు చేరుకున్నాడనేది ఇప్పటికీ మిస్టరీగా నిలిచింది.

  మరింత చదవండి
  next
 3. దిల్‌నవాజ్ పాషా

  బీబీసీ ప్రతినిధి

  అబ్దుల్ రషీద్

  అబ్దుల్ రషీద్ 'బీబీసీ'తో మాట్లాడుతూ.. ''నేను సెంకిలిలో తుక్కు కొంటున్నాను. మోటార్ ‌సైకిల్ మీద వచ్చిన కొందరు యువకులు నన్ను ఆపి, ఎవరు నువ్వు? ఎవరినడిగి ఇక్కడ తుక్కు కొంటున్నావు? అన్నారు. నా బండిలో ఉన్న తుక్కంతా విసిరేసి నాతో దురుసుగా ప్రవర్తించారు'' అన్నారు.

  మరింత చదవండి
  next
 4. గీతా పాండే

  బీబీసీ న్యూస్

  నేహా పాసవాన్

  ‘‘నేహా వేసుకున్న దుస్తుల గురించి ఇంట్లో గొడవ జరిగింది. ఆమె తాతయ్య, బాబాయిలు కర్రలతో నేహాను బాగా కొట్టారు’’

  మరింత చదవండి
  next
 5. సల్మాన్ రావి

  బీబీసీ ప్రతినిధి

  జ్యోతిరాదిత్య సింధియా

  భారత్‌లోని అత్యంత ధనిక రాజకీయ నాయకుల్లో జ్యోతిరాదిత్య ఒకరు. తల్లిదండ్రుల నుంచి ఆయన వారసత్వంగా పొందిన ఆస్తుల విలువ రూ. 25,000 కోట్లకు మించే ఉంటుంది.

  మరింత చదవండి
  next
 6. మధ్యప్రదేశ్‌లో ఆక్సిజన్ కొరతతో చనిపోయిన వారిపై నివేదిక సమర్పించాలన్న మానవ హక్కుల కమిషన్

  మధ్యప్రదేశ్ కరోనా పరిస్థితి

  ఆక్సిజన్ కొరత వల్ల సంభవించే మరణాలపై మధ్యప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ నివేదిక కోరింది

  మధ్యప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో కోవిడ్ కేసులు 5 లక్షల 25 వేలు దాటాయి.

  కొన్ని నగరాల్లో పరిమిత లాక్‌డౌన్‌ విధించినా గ్రాఫ్‌ను కిందకు దించడానికి ఏ మాత్రం సహాయపడలేదు.

  మంగళవారం మధ్య ప్రదేశ్‌లో కొత్తగా 13,417 కరోనా కేసులు నమోదయ్యాయి.

  సోమవారం మొరేనాలో ముగ్గురు, కట్నీలో ఇద్దరు కోవిడ్ రోగులు ఆక్సిజన్ కొరతతో చనిపోయారు.

  దీనికి సంబంధించి రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి, సంబంధిత జిల్లా కలెక్టర్లు, వైద్య అధికారులు మే 3 లోపు ఒక నివేదిక సమర్పించాలని మానవ హక్కుల కమిషన్ కోరింది.

  మధ్యప్రదేశ్‌లో గత 26 రోజుల్లో కొన్ని రోజులు మినహాయించి ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి.

  మంగళవారం పాజిటివిటీ రేటు 22.6 శాతం ఉందని గణాంకాలు చెబుతున్నాయి. అంటే రాష్ట్రంలో టెస్ట్ చేయించుకున్న ప్రతి నాలుగో వ్యక్తికీ కరోనా పాజిటివ్ వచ్చినట్లు లెక్క.

  ఈ నెలలో పాజిటివిటీ రేటు సాధారణ స్థాయి కన్నా మూడు రెట్లు పెరిగింది.

  అయితే సోమవారం నమోదైన 23 శాతం కంటే మంగళవారం పాజిటివిటీ రేటు కొంచెం తక్కువగా కనిపించింది.

  మంగళవారం 98 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ మృతుల సంఖ్య 5,319కు చేరుకుంది.

  మధ్యప్రదేశ్

  ఇండోర్‌లో గరిష్టంగా 1,837 కేసులు నమోదయ్యాయి. తరువాత భోపాల్‌లో 1,836 మంది, గ్వాలియర్‌లో 1,198 మంది కరోనా బారిన పడ్డారు.

  గత 24 గంటల్లో 11,577 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి ఇంటికి వెళ్లడం కొంత ఉపశమనం కలిగించే విషయం. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,25,812కు చేరింది.

  ఏప్రిల్ 27 మంగళవారం నాటికి రాష్టంలో మొత్తం 94,276 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

  మధ్య ప్రదేశ్‌లో కూడా ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ కొరత ఉంది. వీటికి సంబంధించిన ఫొటోలు మీడియాలో కనిపిస్తున్నాయి.

  ఇండోర్‌లోని బ్లడ్ బ్యాంకుల్లో ప్లాస్మా సేకరించే కిట్ల కొరత ఉన్నట్లు కొన్ని రిపోర్టులు తెలిపాయి. దాంతో ప్లాస్మా ఇవ్వడానికి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చేస్తున్నారు.

  మధ్యప్రదేశ్‌కు మెడికల్ ఆక్సిజన్ అందించేందుకు జార్ఖండ్‌లోని బొకారో నుంచి మంగళవారం ఉదయం ఆరు ట్యాంకర్లతో రైలు బయలుదేరింది. వీటిలో 64 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ పంపుతున్నారు.

  శనివారం అర్థరాత్రి షాడోల్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లో ఆక్సిజన్ కొరత కారణంగా ఆరుగురు చనిపోయినట్లు వార్తలు వచ్చాయి.

  ఆ ఇన్‌స్టిట్యూట్ డీన్ అందించిన సమాచారం ప్రకారం ఈ వార్తను పీటీఐ ప్రచురించింది.

  అయితే, తర్వాత మధ్య ప్రదేశ్ వైద్యవిద్యా శాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఉందనే వార్తను ఖండించారు. దీనిపై విచారణ జరపాలని ఆదేశించారు.

 7. కరోనా అంత్యక్రియలు

  "కరోనాతో చనిపోయినవారి అంత్యక్రియల కోసం వారి బంధువులు టోకెన్ తీసుకోవాల్సి వస్తోంది. తర్వాత శ్మశానం దగ్గర 8 నుంచి 10 గంటలు వేచిచూడాల్సి వస్తోంది"

  మరింత చదవండి
  next
 8. పోలీసుల దాడికి గురైన వ్యక్తి

  బహిరంగ ప్రదేశాల్లో ముసుగు ధరించని వారిని అరెస్ట్ చేసి తాత్కాలికంగా జైలులో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో, పోలీసులు తీవ్రంగా ప్రవర్తించడం మొదలైంది.

  మరింత చదవండి
  next
 9. శురేహ్ నియాజీ

  బీబీసీ కోసం

  ఆదివాసీ బాలికను కట్టేస కొట్టారు

  యువకుడు ఆ అమ్మాయిని కలవడానికి వాళ్ల ఊరొచ్చాడు. అదే సమయంలో ఆ యువతి ఇంట్లో వాళ్లు అతడిని పట్టుకున్నారు. బాలికతో కలిపి తాడుతో కట్టేసి ఇద్దరినీ ఊరేగించారు. ఈ మొత్తం ఘటనను మొబైల్లో చిత్రీకరించి దాన్ని వైరల్ కూడా చేశారు.

  మరింత చదవండి
  next
 10. గ్రాఫిక్ చిత్రం

  కడుపులో నొప్పి అంటూ చిన్నారి బాధపడుతుండటంతో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షల్లో చిన్నారి గర్భవతి అని తేలింది. బాలిక చెప్పిన వివరాల ప్రకారం తల్లిదండ్రులు ప్రిన్సిపల్‌ మీదా, అతనికి సహకరించిన టీచర్‌ మీదా ఫిర్యాదు చేశారు.

  మరింత చదవండి
  next