పాకిస్తాన్ ఎన్నికలు 2018

 1. పాకిస్తాన్‌లో 2,800 మందికి కరోనావైరస్

  పాకిస్తానీలకు కరోనా సోకదనే భ్రమల్లో ఉండవద్దని చెప్పిన ప్రధాని ఇమ్రాన్

  ఇమ్రాన్ ఖాన్

  పాకిస్తాన్‌లో కరోనావైరస్ సోకిన వారి సంఖ్య 2,800 దాటింది. పాకిస్తాన్ ప్రజలు కరోనా ప్రభావానికి గురికారనే భ్రమల్లో ఉండవద్దని దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రజలకు సూచించారు.

  శనివారం నాడు కరోనా రిలీఫ్ పండ్ ఏర్పాటు చేసిన ఇమ్రాన్, "అల్లా పాకిస్తానీలను కరోనావైరస్‌కు గురికాకుండా చేశారనే వ్యాఖ్యలు నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను. ప్రజలు ఇలాంటి దురభిప్రాయంతో ఉండవద్దు. కరోనావైరస్ ఎవరినీ విడిచి పెట్టదు" అని అన్నారు.

  కరోనావైరస్‌ విషయంలో ప్రజలను మోసగించవద్దని, అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు.

  "మీకు ఏమీ కాదనుకుంటే, ఒకసారి న్యూయార్క్ నగరాన్ని చూడండి. అక్కడ అధికశాతం ధనవంతులు నివసిస్తున్నారు. కానీ, వారి పరిస్థితి ఇప్పుడు ఏమైందో చూడండి" అని ఇమ్రాన్ ప్రజలకు సూచించారు.

  పాకిస్తాన్‌లోని పేద ప్రజలను ఈ వైరస్ బారి నుంచి కాపాడడం తమ ముందున్న అతి పెద్ద సవాలు అని, వారిని ఆకలితో అలమటించకుండా చూసుకుంటామని ఆయన అన్నారు.

 2. ఇమ్రాన్ ఖాన్

  కశ్మీర్ వివాదం యుద్ధం దిశగా సాగితే, ఉభయ దేశాలకూ (పాకిస్తాన్, భారత్‌లకు) అణ్వస్త్రాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. అణు యుద్ధంలో ఎవ్వరూ విజేతగా నిలవలేరని చెప్పారు.

  మరింత చదవండి
  next