ఎబోలా సంక్షోభం

 1. అన్నె సోయ్

  సీనియర్ ఆఫ్రికా కరస్పాండెంట్, బీబీసీ

  ఆఫ్రికా చిన్నారి

  కరోనా కట్టడికి అమలు చేసిన నియంత్రణలు చాలామంది ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపాయి. ప్రపంచంలో అత్యంత కట్టుదిట్టమైన లాక్‌డౌన్ అమలు చేసిన దేశాల్లో ఒకటైన దక్షిణాఫ్రికాలో ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 22 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు.

  మరింత చదవండి
  next
 2. కరోనావైరస్‌: 'ఎబోలా వైరస్ మందు కోవిడ్ రోగులపై పని చేస్తోంది'

  కరోనా ఔషధం

  ఎబోలా చికిత్సలో ఉపయోగించే ఒక ఔషధం కరోనావైరస్ రోగులు కోలుకోవడానికి సహకరిస్తోందని "స్పష్టంగా" తెలుస్తోందని అమెరికా అధికారులు తెలిపారు.

  అంటువ్యాధుల నిపుణుడు, అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (ఎన్ఐఏఐడి) డైరెక్టర్ ఆంథొనీ ఫౌచీ, కరోనావైరస్ చికిత్సలో ఎబోలా ఔషధంతో జరుగుతున్న ప్రయోగాలు ఫలించవచ్చనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

  రెమిడిస్వియర్‌గా పిలిచే ఈ మందును ప్రాథమికంగా ఎబోలా వైరస్‌కు చికిత్స చేయడానికి అభివృద్ధి చేశారు.

  "గణాంకాలు బట్టి చూస్తే రెమిడిస్వియర్ మందు తీసుకున్న కోవిడ్ రోగులు త్వరగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. రోగిలో వ్యాధి లక్షణాలు కొనసాగే వ్యవధిని ఈ మందు 15 రోజుల నుంచి 11 రోజులకు తగ్గించిందని ప్రాథమిక వివరాలు చెబుతున్నాయి. ఈ ఫలితాలు ఏదో అద్భుతంలా కనిపించకపోవచ్చు. కానీ, ఎబోలా మందు కరోనావైరస్‌ను నిరోధించగలదని నిరూపణ అయింది" అని డాక్టర్ ఫౌచీ అన్నారు.

  ఎన్ఐఏఐడి ఈ చికిత్సలను ప్రయోగాత్మకంగా పరీక్షించింది. అయితే, ఫలితాలను ఇంకా వెల్లడి చేయలేదు.

  చైనాలో రెమిడిస్వయర్ మందుతో కరోనావైరస్ రోగులకు చికిత్స చేసినప్పుడు ఫలితాలు కనిపించలేదని, ఆ దేశంలోని ప్రయోగాల గురించి లాన్సెట్ అనే మెడికల ్ జర్నల్ పూర్తి వివరాలను ప్రచురించిన అనంతరం డాక్టర్ ఫౌచీ ప్రకటన వెలువడింది. అయితే, చైనాలో ఈ ప్రయోగాలు ఇంకా కొనసాగుతున్నాయి.

 3. జస్టిన్ హార్పర్

  బీబీసీ ప్రతినిధి

  కరోనావైరస్ మందు

  బిలియన్ల కొద్దీ వ్యాపారం జరిగే అవకాశం ఉంది కాబట్టి భారీ ఫార్మా సంస్థలు వెంటనే దీనికి వ్యాక్సిన్‌ను రూపొందించే పనిలో పడి ఉంటాయని చాలా మంది అనుకుంటుంటారు. కానీ, వాస్తవ పరిస్థితి అలా లేదు.

  మరింత చదవండి
  next
 4. విజయ్ గజం

  బీబీసీ కోసం

  బాధితుడి తల్లి

  "భోజనం బాగుండేది కాదు. ఉదయం ఒక్క బ్రెడ్ ఇచ్చేవారు. అనారోగ్యం వస్తే తామే చూసుకుంటాం అన్నారు. కానీ అక్కడకు వెళ్లాక కనీసం చేతికి వేసుకునే గ్లోవ్స్ కూడా ఇవ్వలేదు."

  మరింత చదవండి
  next