ఏఐఎంఐఎం

 1. ఐదు ఎకరాల స్థలం అవసరం లేదు: ఓవైసీ

  ముస్లిం పక్షానికి ఐదు ఎకరాల స్థలం ఇవ్వాలన్న సుప్రీం తీర్పుతో ఓవైసీ విభేదించారు.

  ఇంకా ఆయన ఏమన్నారంటే...

  ·మా చట్టపరమైన హక్కుల కోసం మేం పోరాడుతున్నాం. ముస్లింలు పేదలు, వారిపై వివక్షత ఉంది. మాకు ఉద్దీపనలు, భిక్ష అవసరం లేదు.

  ·ముస్లిం పర్సనల్ లా బోర్డు 5 ఎకరాల స్థలాన్ని అంగీకరిస్తుందో లేదో చూడాలి, ఈ ప్రతిపాదనను తిరస్కరించాలని నా వ్యక్తిగత అభిప్రాయం.

  ·హిందూ రాష్ట్ర మార్గంలో దేశం వెళుతోంది. అయోధ్య విషయాన్ని సంఘ్ పరివార్, బీజేపీలు ఉపయోగించుకుంటాయి.

  ·అక్కడ ఒక మసీదు ఉంది, అలాగే ఉంటుంది. 500 ఏళ్ల నుంచి అక్కడ మసీదు ఉందని మేం మా ముందుతరాలకు చెబుతాం. 1992లో, సంఘ్ పరివార్, కాంగ్రెస్ కుట్ర కారణంగా ఆ మసీదు కూలిపోయింది.

  View more on twitter
 2. ఒకవేళ మసీదు కూల్చకపోతే, ఎలాంటి తీర్పు వచ్చేది: ఓవైసీ

  రాజీవ్ ధావన్‌తో పాటు సుప్రీంకోర్టులో ముస్లింల పక్షం మాట్లాడిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. సుప్రీం తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విశ్వాసాలు వాస్తవాలపై విజయం సాధించాయని పేర్కొన్నారు.

  ‘‘ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ మాదిరిగా, మేము కూడా దీనిపై సంతృప్తి చెందడం లేదు. సుప్రీంకోర్టు సుప్రీం కావొచ్చు కానీ అది దోషరహితమైనది కాదని జస్టిస్ జేఎస్ వర్మ చెప్పారు. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూల్చివేసిన వారితోనే ఈ రోజు ట్రస్ట్ నిర్మించి ఆలయ పనులను ప్రారంభించాలని సుప్రీంకోర్టు చెబుతోంది. మసీదు కూల్చివేయకపోతే, కోర్టు ఎలాంటి తీర్పునిచ్చేది’ అని ప్రశ్నించారు.

  అసదుద్దీన్ ఓవైసీ
  Image caption: అసదుద్దీన్ ఓవైసీ
 3. ఉదయన్‌రాజె భోంస్లే

  ఉత్తర ప్రదేశ్‌లో అత్యధికంగా 11 శాసనసభ నియోజకవర్గాల్లో ఉపఎన్నికల జరగ్గా.. గుజరాత్‌లో 6, బిహార్, కేరళ రాష్ట్రాల్లో అయిదేసి శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు.

  మరింత చదవండి
  next
 4. రాజా సింగ్, అక్బరుద్దీన్ ఒవైసీ

  హిందూ-ముస్లిం జనాభా నిష్పత్తిని సమానం చేస్తామని తాను చేసిన వ్యాఖ్యలకు ఆర్ఎస్ఎస్ ఇంకా భయపడుతోందని అక్బరుద్దీన్ అంటే, సత్తా తేల్చుకునేందుకు ఎదురుగా రావాలని రాజాసింగ్ సవాల్ చేశారు.

  మరింత చదవండి
  next