శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ

 1. ఛత్తీస్‌గఢ్: పెరుగుతున్న కేసులు, నెమ్మదించిన వ్యాక్సినేషన్

  ఆలోక్ ప్రకాశ్ పుతుల్, రాయ్‌పూర్ నుంచి

  ఛత్తీస్‌గఢ్‌లో గత 24 గంటల్లో కొత్తగా 14,893 కరోనా కేసులు నమోదయ్యాయి. 236 మంది చనిపోయారు.

  ఏప్రిల్‌లో కరోనా కేసుల విషయంలో ఛత్తీస్‌గఢ్‌ మహారాష్ట్ర తర్వాత రెండో స్థానంలో నిలిచింది. మిగతా రాష్ట్రాల్లో కేసులు వేగంగా పెరిగిన తర్వాత, దేశంలో మొత్తం కేసుల విషయంలో జాబితాలో దిగువనే ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో కోవిడ్ కేసులు తగ్గుతున్న పరిస్థితి కనిపించడం లేదు.

  ప్రభుత్వ గణాంకాల ప్రకారం మార్చి 31 వరకూ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,49,187. 4170 మంది చనిపోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 25,529.

  కానీ ఏప్రిల్ నెల నుంచి రాష్ట్రంలో రికార్డు సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. గత 27 రోజుల్లోనే మొత్తం కేసుల సంఖ్య 6,82,339కు చేరుకుంది. మరణాలు 7,782కి పెరిగింది.

  ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,19,068 ఉంది.

  రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఎంత వేగంగా పెరుగుతోందో, వ్యాక్సినేషన్ అంత నెమ్మదవుతోంది. ఉదాహరణకు ఏప్రిల్ 1న 2.34 లక్షల డోసులు, 2న 3.26 లక్షల డోసులు టీకా వేశారు.

  కానీ, ఆ గణాంకాలు మెల్లమెల్లగా తగ్గాయి. ఏప్రిల్ 15 నాటికి అవి రాష్ట్రంలో దాదాపు 42 వేలు, ఏప్రిల్ 21న 40 వేల డోసులకు తగ్గింది. ఏప్రిల్ 27 నాటికి రాష్ట్రంలోని మొత్తం 28 జిల్లాల్లో కలిపి, 27,111 డోసులే వేశారు.

  కేంద్రం నుంచి టీకాలు అందకపోవడం వల్లే ఆ పరిస్థిత వచ్చిందని రాష్ట్ర ఆరోగ్య విభాగం అధికారులు చెబుతున్నారు.

  ఛత్తీస్‌గఢ్‌లో కరోనా రికార్డు కేసులు
 2. పంజాబ్

  నిహాంగ్ సిక్కుల దాడిలో ఒక పోలీస్ అధికారి చేయి తెగిపోయింది. చండీగఢ్ ఆస్పత్రిలో ఆయన చేతిని అతికించే ప్రయత్నం జరుగుతోంది.

  మరింత చదవండి
  next