రాజమౌళి

 1. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్

  "నేను, రామ్‌చరణ్‌ దీని కోసం కలిసి రావడం ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తించింది. 'ఆర్‌.ఆర్‌.ఆర్‌'ని ఓటీటీలో విడుదల చేయాలని మేమెప్పుడూ అనుకోలేదు. సమష్టిగా కలిసి పెద్ద తెరపై చూస్తూ ఆస్వాదించే సినిమాలు కొన్ని ఉంటాయి" అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.

  మరింత చదవండి
  next
 2. ఆర్ఆర్ఆర్ మూవీ

  రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, అజయ్‌ దేవగణ్‌, అలియాభట్‌తో కలసి దర్శకుడు రాజమౌళి చిన్న వీడియో రూపంలో వినూత్నంగా కోవిడ్‌ సందేశాన్ని ఇచ్చారు.

  మరింత చదవండి
  next
 3. ఆర్ఆర్ఆర్ మూవీ

  రాజమౌళి ఆర్.ఆర్.ఆర్. చిత్రంలో కొమురం భీమ్ లుక్ విడుదల గురించి రామ్‌చరణ్, ఎన్టీఆర్ మధ్య ట్విటర్‌లో సరదా సంభాషణ నడిచింది. చివరకు టీజర్ విడుదలైంది.

  మరింత చదవండి
  next
 4. ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ రీషెడ్యూల్

  దేశమంతా కొనసాగుతున్న లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్‌కు సంబంధించిన పని మొత్తాన్ని రీషెడ్యూల్ చేసుకుంటున్నట్టు దర్శకుడు రాజమౌళి తెలిపారు.

  మరింత చదవండి
  next
 5. RRR: సినిమా టీమ్ కూడా ఇంటి నుంచే పనిచేస్తోంది - రాజమౌళి

  టాలీవుడ్ అగ్ర హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటిస్తున్న RRR చిత్రం టైటిల్ లోగోను, మోషన్ పోస్టర్‌ను ఈరోజు విడుదల చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

  ఈ చిత్రంలో బాలీవుడ్ నటీనటులు అజయ్ దేవగణ్, ఆలియాభట్‌ కూడా నటిస్తున్నారు.

  స్వాతంత్ర్య పోరాటం జరిపిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ల స్ఫూర్తితో ఈ చిత్ర కథను రూపొందించామని గతంలో రాజమౌళి తెలిపారు.

  ‘‘ఇది ప్రపంచ సంక్షోభ సమయం. అయితే, అందరిలోని స్ఫూర్తిని మరింత పెంచేందుకు మావంతు ప్రయత్నం చేద్దామనుకున్నాం. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌లను విడుదల చేస్తున్నాం’’ అని మంగళవారం రాత్రి రాజమౌళి పోస్ట్ చేశారు.

  అయితే, తమ బృందంలోని అందరూ తమతమ ఇళ్లనుంచే పనిచేస్తున్నందున ఇవి ఎప్పుడు విడుదల అవుతాయనే సమయాన్ని నిర్థిష్టంగా తాను చెప్పలేనని ఆయన వివరించారు.

  అభిమానులంతా తమతమ ఇళ్లనుంచే వీటిని చూసి ఆనందించాలని రాజమౌళి విజ్ఞప్తి చేశారు.

  దేశమంతా లాక్‌డౌన్‌లో ఉందని, కాబట్టి మూకుమ్మడిగా కలవడానికి ఏ కారణమూ ఉండకూడదని ఆయన పేర్కొన్నారు.

  ఎలాంటి ఫ్లెక్సీలు, ప్రింట్‌లు వేయొద్దని, ఇంట్లో కూర్చుని, భద్రంగా ఉండాలని, ఆన్‌లైన్‌ ద్వారా చూసి ఆనందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

  View more on facebook
  RRR: సినిమా