ఈశాన్య భారత్

 1. కలాం

  కలాం చివరి ఘడియలు ఎలా గడిచాయి? ఆ రోజు దిల్లీ నుంచి షిల్లాంగ్ ప్రయాణంలో, ఐఐఎంలో ఏం జరిగింది? కలాం చివరి మాటలేంటి? కలాంకు అనుచరుడిగా, సలహాదారుగా పనిచేసిన శ్రీజన్‌ పాల్ సింగ్ మాటల్లో..

  మరింత చదవండి
  next
 2. పోలీసులు

  'అస్సాం పోలీసు విభాగానికి చెందిన ఆరుగురు జవాన్లు అస్సాం-మిజోరం సరిహద్దుల్లో తమ రాష్ట్ర సరిహద్దును కాపాడుకునే క్రమంలో ప్రాణాలొదలడం నన్ను తీవ్రంగా బాధించింది' అని ఆయన ట్వీట్ చేశారు.

  మరింత చదవండి
  next
 3. మీరాబాయి చానూ

  ట్రైనింగ్ కోసం మీరాబాయి 20 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి వచ్చేది. ఇలా బరువులు ఎత్తేవారికి పాలు, చికెన్ తప్పనిసరి. అయితే, వీటిని రోజూ తీసుకువచ్చే స్తోమత మీరాబాయి కుటుంబానికి ఉండేదికాదు. అయినా ఆమె వెనకడుగు వేయలేదు.

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: ఈ ఊరిలో పిల్లలకు పేర్లు ఉండవు, మరి ఎలా పిలుస్తారు?
 5. సల్మాన్ రవి

  బీబీసీ ప్రతినిధి

  కోవిడ్-19

  మేఘాలయలో ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు, వీధి వ్యాపారులు, దుకాణదారులు తప్పనిసరిగా వ్యాక్సీన్లు వేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

  మరింత చదవండి
  next
 6. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  1967లో ఒకరికొకరు ఎదురెదురుగా తలపడ్డ భారత, చైనా సైనికులు

  "గ్రెనేడియర్స్ వారి కమాండింగ్‌ ఆఫీసర్‌ చనిపోవడం చూసి కోపంతో రగిలిపోయారు. వారు తమ బంకర్ల నుండి బయటకు వచ్చి కెప్టెన్‌ పి.ఎస్‌.డాగర్ నేతృత్వంలో, చైనా స్థావరాలపై దాడి చేశారు.’’

  మరింత చదవండి
  next
 7. తప్పిపోయిన పులి పిల్ల

  ఈశాన్య భారతదేశంలోని అసోం రాష్ట్రంలో అటవీ శాఖ అధికారులు తప్పిపోయిన పులిపిల్లను తల్లితో కలిపారు. తప్పిపోయిన 12 గంటలలోపే ఆ చిరుత పిల్లను తల్లి కనిపెట్టగలిగింది.

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: అరుణాచల్‌లో క్షణాల్లో కుప్పకూలిన జాతీయ రహదారి
 9. Video content

  Video caption: ఫంక్షన్ హాల్స్ మీద దాడి చేసి, పెళ్లిళ్లు చేస్తున్నవారిని పరుగులు పెట్టించిన కలెక్టర్
 10. అస్సాం: ఎన్నికల తర్వాత హఠాత్తుగా పెరిగిన కరోనా కేసులు

  దిలీప్ కుమార్ శర్మ, గువాహటి నుంచి

  అస్సాంలో కరోనా పరిస్థితి

  ఈశాన్య రాష్ట్రం అస్సాంలో వారం నుంచి కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 3,132 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 18 మంది చనిపోయారు.

  ఇలా రాష్ట్రంలో కరోనాతో గత ఐదు రోజుల్లో 73 మంది చనిపోయారు. రాష్ట్ర రాజధాని గువాహటి, కామరూప్ మెట్రో జిల్లాలో పరిస్థితి ఘోరంగా ఉంది. ఇక్కడ మంగళవారం 1313 కేసులు నమోదయ్యాయి.

  నిజానికి ఇదే నెల ఏప్రిల్ 6న అస్సాం అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఆ తర్వాత కొన్ని రోజులకే కరోనా కేసులు హఠాత్తుగా పెరగడం మొదలయ్యాయి. కామరూప్ మెట్రో జిల్లాలో గత ఐదు రోజుల్లో 4752 కేసులు నమోదయ్యాయి.

  మరోవైపు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కరోనా కేసులు బయటపడుతుండడంతో అధికారులు రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 వరకూ నైట్ కర్ఫ్యూ విధించారు.

  దీంతోపాటూ నర్సరీ నుంచి 8వ తరగతి వరకూ స్కూళ్లు, విద్యాసంస్థలు, హాస్టళ్లు మూసేశారు. రాజధాని దిల్లీ, మహారాష్ట్రలో కరోనా కేసులు పెరగడం, మందులు, ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉండడంతో అస్సాం ఆరోగ్య మంత్రి హిమంత్ బిస్వ్ సర్మా రాష్ట్రంలో పరిస్థితి అదుపులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగుల కోసం అదనపు బెడ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

  మీడియాతో మాట్లాడిన ఆయన అస్సాంలో రెమెడెసివీర్ 25 వేల ఇంజెక్షన్లు స్టాక్‌లో ఉన్నాయని, మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లో ఉపయోగించేలా అస్సాంలో ప్రస్తుతం 8 ఆక్సిజ్ ప్లాంట్స్ పనిచేస్తున్నాయని తెలిపారు.

  “అస్సాంలో 8 ఆక్సిజన్ ప్లాంట్స్ పనిచేస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల అవసరాలు పూర్తి చేయడానికి మేం పీఎం కేర్స్ నిధుల ద్వారా మరో 10 ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేయబోతున్నాం. మా దగ్గర 2 వేల ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు కూడా స్టాక్‌లో ఉన్నాయి” అని మంత్రి చెప్పారు.

  మంగళవారం అస్సాంకు 4 లక్షల కోవిషీల్డ్, లక్ష కోవాగ్జిన్ డోసులు కూడా అందినట్లు మంత్రి చెప్పారు. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం 6,57,180 డోసుల నిల్వ ఉన్నాయని తెలిపారు.

  అస్సాం ఆరోగ్య విభాగం సమాచారం ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం 19,923 యాక్టివ్ కేసులు ఉన్నాయి.